Sunday, January 19, 2025

లేడీస్ వాష్‌రూములో వీడియోల రికార్డింగ్..ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నగర శివార్లలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల వాష్‌రూములోపల విద్యార్థినుల వీడియోలను రికార్డు చేసిన ఒక 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కొంబల్‌గోడులోగల ఎసిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులు వాష్‌రూములో ఉండగా వారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వాటిని సర్కులేట్ చేస్తున్నాడంటూ శనివారం విద్యార్థినులు పెద్దపెట్టున కళాశాల క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ సంఖ్యలో కళాశాలకు చేరుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఏడవ సెమిస్టర్ చదువుతున్న నిందితుడినిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు విద్యార్థినులకు హామీ ఇచ్చారు. వీడియోల విషయం బయటకు చెబితే చంపివేస్తానంటూ కూడా నిందితుడు తమను బెదిరించినట్లు విద్యారినులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News