Wednesday, January 22, 2025

రాతపరీక్షలో తప్పులు సరిదిద్దాలి: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో తప్పుగా వచ్చిన నాలుగు ప్రశ్నలను సరిదిద్దాలని జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ణప్తి చేశారు.పరీక్ష కీ విడుదల చేసినప్పుడే అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు ఎంతో విలువైనదని తెలిపారు. ఆ ఒక్క మార్కు జీవితాలనే మార్చేస్తుందన్నారు. పోలీసు నియామక రాత పరీక్షలు రాసిన యువకుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలని కోరారు. సిఎం కేసిఆర్ , మంత్రి కేటిఆర్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News