Wednesday, January 22, 2025

నిషేధిత ఖాతాలపై ఆలోచించి నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Recovering Twitter banned accounts is not possible now

ట్విట్టర్ కొత్తబాస్ మస్క్ వెల్లడి

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్ నిషేధిత ఖాతాల పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు జరిగే పనికాదని దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అన్ని విషయాలను పరిశీలించి ట్విట్టర్ ఖాతాల నిషేధంపై తగు నిర్ణయం తీసుకోవడానికి మరి కొద్ది వారాలు పడుతుందని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ , బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి వారి ట్విట్టర్ ఖాతాలపై ఇప్పుడు నిషేధం అమలులో ఉంది. మస్క్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ ఇతరుల ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే తొందరపడేది ఏమీ లేదని మస్క్ తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలకు ట్విట్టర్ వేదికలను వాడుకున్నారనే అంశంతో ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధం విధించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తాను ప్రాధాన్యత ఇస్తానని, అత్యంత తీవ్రస్థాయి సైబర్ నేరాల అభియోగాలు ఉంటే తప్ప ట్విట్టర్ వాడకాలపై నిషేధాలు ఉండవని ఇటీవలే మస్క్ ప్రకటించారు. నిబంధనల ఉల్లంఘనకు దిగిన వారి సంబంధిత ఖాతాలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటారని అధికారికంగా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News