Sunday, December 22, 2024

ఏడాదిలో 30 వేల ఫోన్ల రికవరీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పోలీస్ రికార్డు

హైదరాబాద్: మిస్సయిన, దొంగతనానికి గురైన 30 వేల ఫోన్లను రికవరీ చేసి తెలంగాణ పోలీస్ రికార్డు సృష్టించింది. ఏడాదిలో 30 వేల ఫోన్లను రికవరీ చేసిన కర్నాటక తర్వాత రెండో స్థానంలో నిలిచింది. సిఈఐఆర్ పోర్టల్ తో పాటు ట్రాకింగ్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ జరిగిందని అడిషనల్ డిఐజి మహేశ్ భగవత్ తెలిపారు. ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.

2023 ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు 30049 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4869, సైబరాబాద్ పరిధిలో 3078, రాచకొండ పరిధిలో 3042 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. సెల్ ఫోన్ చోరికి గురైనప్పుడు లేదా కనిపించకుండా పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే ఫోన్ల ట్రాకింగ్ సులభం అవుతుందని మహేశ్ భగవత్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News