Thursday, January 23, 2025

ఉపాధి హామీ పనుల్లో నిధుల రికవరీ రూ.20,978

- Advertisement -
- Advertisement -

కమాన్‌పూర్: మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ అడిట్ నిర్వహించారు. 13వ విడత సామాజిక తనిఖీని మండల స్థాయి ప్రజావేదికలో ఎంపీపీ రాచకొండ లక్ష్మీఅధ్యక్షతన జరిగింది. ఇందులో రెండేళ్ల ఆరు నెలల కాలవ్యశదిలో రూ.4,87,04,918ల నిధులను ఉపాధిహామీ పథకంలో పలు అభివృద్ది పనుల నిర్వహణకు ఖర్చు చేశారు.

ఈ పనుల్లో జరిగిన విషయాలను సామాజిక తనిఖీల్లో బృందాలు పరిశీలన చేశారు. అనంతరం మంగళవారం మరోసారి మండల పరిషత్ సమావేశంలో ఆయా గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీ నివేదికలను పరిశీలించారు. ఇందులో మండలంలోని తొమ్మిది గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ది నిర్వహణలో రూ.20,978 నిధుల రికవరికి సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉన్నతాధికారులు ఆదేశించారు.

మండలంలోని రొంపికుంటలో రూ.7452, నాగారంలో రూ.7305, సిద్దిపల్లెలో రూ.400, గొల్లపల్లిలో రూ.1300,పెంచికల్‌పేటలో రూ.1108, జూలపల్లిలో రూ.3021ల చొప్పున నిధులు రికవరీ చేయాలని ప్రజావేదికలో అధికారులు ఆదేశించారు. ఈ తనీఖీల్లో డీఆర్‌డీఓ శ్రీధర్, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News