Monday, December 23, 2024

అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ప్రధాని మోడీ ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బషీరాబాగ్ భారతీయ విద్యాభవన్‌లో జరిగిన 9వ ‘రోజ్ గార్ మేళా‘ కార్యక్రమంలో 12 శాఖల్లోని వివిధ విభాగాల్లో 238 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక శక్తిగా అవతరించిందన్నారు. గ్రామీణం నుంచి పట్టణాల వరకు దేశ వ్యాప్తంగా 12 లక్షల ఉద్యోగాలను వేగవంతంగా పూరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే అన్నారు. ప్రతినెలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News