Wednesday, January 22, 2025

ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఖారారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ నెల 15, 16న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష, ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 23న సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎఎంవిఐ) నియామక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ అండ్ బి) పోస్టులకు, రవాణాశాఖలో 113 సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎఎంవిఐ) పోస్టులకు, హార్టికల్చర్ ఆఫీసర్ 22 పోస్టులకు గతంలో వేర్వేరుగా టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేసింది. అయితే, హాల్ టికెట్ డౌన్‌లోడ్ తేదీలను మాత్రం ప్రకటించలేదు. పూర్తి వివరాలకు టిఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అభ్యర్థులకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News