Monday, December 23, 2024

ఎయిర్ ఇండియాలో నియామకాలు షురూ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా తన 470 కొత్త విమానాల కోసం నియామకాలు ప్రారంభించింది. నివేదికల ప్రకారం, బోయింగ్, ఎయిర్‌బస్‌లు విమానాలను డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా వివిధ ర్యాంక్‌లలో ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమైంది. ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 140 విమానాల సహాయక సిబ్బంది ఉన్నారు. ఎయిర్ ఇండియా కొన్ని హోదాల వారికి సంవత్సరానికి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ వేతన ప్యాకేజీలను కూడా ఆఫర్ చేస్తోంది. నివేదికల ప్రకారం, ఎయిర్ ఇండియా ’బి777 కెప్టెన్’ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

దీని కోసం ఎయిర్‌లైన్ వార్షిక వేతనం రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుంది. ఎయిర్ ఇండియా ఒప్పందం తర్వాత భారత విమానయాన రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. ఫిబ్రవరి 14న టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్, బోయింగ్ నుండి మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. 470 విమానాలను నడపడానికి 6,500 మందికి పైగా పైలట్లను నియమించుకోవాల్సి ఉంటుందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం 1,600 మంది పైలట్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News