- Advertisement -
హైదరాబాధ్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. త్వరలోనే ఆర్టిసిలో 3,038 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 2 వేల డ్రైవర్, 743 శ్రామిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పాటు 84 డిప్యూటీ సూపరిండెంట్(ట్రాపిక్), 114 డిప్యూటీ సూపరిండెంట్(మెకానికల్) పోస్టుల భర్తీ చేయనున్నారు. అంతేకాక.. 25 డిపో మేనేజర్జజ/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) పోస్టులు, 11 సెక్షన్ ఆఫీసర్(సివిల్) పోస్టులు, 6 అకౌంట్ ఆఫీసర్స్ పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్ పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
- Advertisement -