Monday, December 23, 2024

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4356 పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియామకాలు
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు
సిఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర్ నరసింహ కృతజ్ఞతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అక్టోబర్ -2021 నుండి ఖాళీగా ఉన్న 4356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 4356 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ జిఒ 98ను విడుదల చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1459, ట్యూటర్లు 412, సీనియర్ ప్రెసిడెంట్ 1201 పోస్టులు భర్తీ చేయడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు సిఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం 634 కోట్ల 48 లక్షల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6,958 స్టాప్ నర్సుల నియామకాల్లో భాగంగా మెడికల్ కాలేజీల్లో నియమకాలు చేపట్టామన్నారు. వైద్య కళాశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల చేపట్టిన నియామకాల ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో ప్రధానంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సమస్యను అధిగమించబోతున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా సత్వరమే ఈ నియామకాలు చేపట్టాలని హెల్త్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. ఈ నియమకాలు అన్ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన జీవో 4271 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News