Saturday, January 11, 2025

టిఎస్ ఆర్టీసిలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ

- Advertisement -
- Advertisement -

Recruitment of Apprentice vacancies in TS RTC

అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : అర్హులైన, ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అభ్యర్థుల నుంచి టిఎస్ ఆర్టీసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆయా రీజియన్లలోని అన్ని డిపోల్లో ఈ విభాగంలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఇందులో శిక్షణ పొందేందుకు అర్హులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసి పేర్కొంది. అప్రెంటిస్ శిక్షణ పొందడానికి ఇంజనీరింగ్ (బిటెక్, బిఈ), అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బికాం, బిఎస్సీ, బిఎ, బిబిఎ, బిసిఎ) అభ్యర్థులు అర్హులుగా సంస్థ పేర్కొంది. టిఎస్‌ఆర్టీసి అధికారిక వెబ్ సైట్ (www.tsrtc.telangana.gov.in)లో పేర్కొన్న నిబంధనలు, షరతులకు లోబడిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఆన్‌లైన్ www.mhrdnats.gov.in వెబ్‌పోర్టల్లో టిఎస్ ఆర్టీసి (యూజర్ ఐడి :STLHDS000005) లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆర్టీసి సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News