Sunday, December 22, 2024

వైద్యశాఖలో కొనసాగుతున్న కొలువుల జాతర

- Advertisement -
- Advertisement -
ఆయూష్ విభాగంలో 156 వైద్యుల భర్తీకి నోటిఫికేషన్
ఆగస్టు 7వ తేదీ నుంచి 22 వరకు దరఖాస్తులకు గడువు

హైదరాబాద్ : తెలంగాణ వైద్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతుంది. గురువారం వైద్యారోగ్య శాఖ, ఆయూష్ విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ నుంచి 22 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ, పూర్తి వివరాల కోసం mhsrb.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ కావొచ్చని బోర్డు సూచించింది. ఈసందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్విట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు పేదలకు సకాలంలో అందించేందుకు వైద్యుల నియమాకాలు చేపటినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News