Monday, December 23, 2024

కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు భారీ గండి…. రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

Red alert in Kadam project area

 నిర్మల్: కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కు భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎడమ కాలువకు భారీ గండిపడింది దీంతో కడెం దిగువ ప్రాంతాల ప్రజలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 గ్రామాలలో సైరన్ మోగించడంతో ప్రజలను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కడెం గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి విషయాలు తెలుసుకుని సూచనలు చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు ప్రమాదపుటంచున్న ఉన్న విషయం తెలియగానే హుటాహుటిన నిర్మల్ నుండి కడెం ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరారు. నిర్మల్- మంచిర్యాల రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆర్మూర్ నుంచి మెట్ పెల్లి మీదుగా ప్రయాణం కడెం చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News