Wednesday, January 22, 2025

తమిళనాడులో రెడ్ అలర్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మాండోస్ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తమళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.రాష్ట్రంలోని 12జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. పది జిల్లాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. అటు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాలయసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల్లో ఉన్న జాలర్ల కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా చెన్నై రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దు చేసినట్టు విమానయాన సంస్థ ప్రకటించింది. తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై ప్రభావం చూపుతోది. రాయల సీమతోపాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీటి పారుదల , విద్యుత్ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పెన్నానదికి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉండటంతో సోమశిల ప్రాజెక్టు నీటినిర్వహణపై ముదు జాగ్రత్తలు తీసుకుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలుల 72టిఎంసీలకు గాను ప్రస్తుతం 70టిఎంసీల నీరు నిలువ ఉంది.

అయితే భారీ వర్షాలతో రానున్న వరదనీటిని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్‌ను ఖాళీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గేట్లు తెరిచి 24వేలక్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువన నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరో వైపు మైపాడు వద్ద సముద్రం 50మీటర్ల మేరకు ముందుకు చొచ్చుకు వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.మాండోస్ తుపాన్ ప్రభావం 2020లో వచ్చిన నివర్ కంటే, 2018లో వచ్చిన గత తుపాన్‌కంటే బలమైనదని అని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో కుండపోత!
రాగల 24గంటల్లో తుపాన్‌ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. తమిళనాడుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.తిరుమలలో వర్షం కుండపోతగా పడుతోంది. చిత్తూరు, కడప ,పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు భారీ వర్సాలు కురుస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

ఈ తుపాను శనివారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 270కి.మి దూరంలో కేంద్రకృతమై ఉందని తెలిపింది. రానున్న కొన్ని గంటల్లో ఇది బలహీన పడి పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News