- Advertisement -
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం రికార్డు స్థాయిలో 3.2 సెమీ. వాన కురిసింది. మృతుల సంఖ్య 5కు పెరిగింది. 538 గుడిసెలు ధ్వంసమయ్యాయి. చెన్నైలో మరింతగా వానలు పడనున్నాయని మంగళవారం రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కెకెఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు. రాగల రెండు రోజులకు చెన్నైకు ‘రెడ్ అలర్ట్’ హెచ్చరిక జారీచేశామని కూడా రామచంద్రన్ తెలిపారు. వానలు మరింత తీవ్రతరం అయితే మరింతగా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. చెన్నై వాసులు వానకు సంబంధించిన ఇబ్బందులపై సాయం లేక ఫిర్యాదు చేయాలనుకుంటే 1913 నంబర్ కు ఫోన్ చేయొచ్చు.
- Advertisement -