Sunday, December 22, 2024

50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్‌ అతలాకుతలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా మారింది. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా హిమాచల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం నివాసాలను ముంచెత్తుతున్నాయి. వరద ప్రవాహంలో ఇళ్లు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక, నదుల ఉధృతికి పలు బ్రిడ్జిలు కూలిపోయాయి.

భారీ వర్షాలకు ఇప్పటికే హిమాచల్‌లో 17 మంది మృతి చెందారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన జాతీయ విపత్తు సహాయక చర్యల బృందాలు (ఎన్‌డిఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు (ఎస్‌డిఆర్‌ఎఫ్)లు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఉత్తరాదిలో జల ప్రళయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ఉత్తరాది జలవిల..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News