Thursday, January 23, 2025

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణలో ఒక మో స్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడిం చింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ చత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ స్థిరంగా కొనసాగుతోంది. బుధ వారం ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుం చి తెలంగాణ , విదర్భల మీదుగా దక్షిణ చత్తీస్ గఢ్ వరకూ మట్టం నుంచి కి.మీ ఎత్తు వరకూ కొనసాగుతోంది. కర్ణాటక పరిస ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.15.8 కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతోంది వీటి ప్ర భావంతో రాగల మూడు రోజులు తెలంగాణ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడ క్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

గ్రేటర్ హైదరాబాద్ నగరా నికి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసిం ది. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్క సారిగా కుండపోత వర్షం కురిసింది. నగర మంతటా విస్తారంగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. 24గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని గోల్కొండలో 95.3 మి.మి వర్షం కురిసింది. శివరాంపల్లిలో 43, కీసరలో 72, అల్వాల్‌లో 71, షేక్‌పేట్‌లో 65, శేర్‌లింగంపల్లిలో 61, ఆశీఫ్ నగర్‌లో 55, కాప్రాల 52, రాజేంద్రనగర్‌లో 52, నాంపల్లిలో 48, మల్కాజిగిరిలో 43, మేడ్చెల్‌లో 39 చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News