Thursday, January 23, 2025

ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కు రెడ్ కార్నర్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి మాజీచీఫ్ ప్రభాకర్‌రావు, ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్‌కుమార్‌రావుకు హైద రాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా శ్రవణ్ కుమార్ లండన్‌లో ఉన్నారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే వీరు విదేశాలకు వెళ్లినట్లు ఆ రోపణలు వచ్చాయి. వీరిని అరెస్ట్ చేసేందుకు ప్ర యత్నిస్తున్న పోలీసులు తొలుత లుక్ ఔట్ నోటీ సులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశా రు. తాజాగా రెడ్ కార్నర్ నోటీ సులు జారీ చేశా రు.ఇందుకు అవసరమైన ప్రక్రియలో భాగంగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ సైతం దాఖలు చేశా రు. ఈ నోటీసులు జారీ కావడంతో విదేశీ దర్యా ప్తు సంస్థల సహకారంతోవీరిని అరెస్ట్ చేసి స్వ దేశానికి రప్పించే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News