Monday, April 28, 2025

ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే

- Advertisement -
- Advertisement -

ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండు దొందూ దొందే

నీటి మూటలుగా మిగిలిపోయిన పాలకుల హామీలు

కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నలో సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేది ప్రజలను పోరాటాలలో పాల్గొనేలా చైతన్యం చేసేది ఒక్క ఎర్రజెండా తప్ప ఇతర పార్టీలు కాదని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం నుండి వందలాది మందిలతో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గతంలో పరిపాలించిన బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయక ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అందరు గమనించారని, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన వాటాలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయి పేద ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ధారాధత్వం చేయడానికి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారని, దేశ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర బిజెపి చేస్తుందని, పహల్గామాలో జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగానికి సంబంధించిన నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్న ఇచ్చిన హామీలను మర్చిపోయి తమ పరిపాలనను కొనసాగిస్తున్నారే తప్ప ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒకటి రెండు తప్ప మిగతా అమలు చేయడంలో విఫలమయ్యారని వారు అన్నారు. గ్రామాలలో అనేకమంది అర్హులైన వారు ఇందిరమ్మ ఇళ్లకు, రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న ఇప్పటివరకు అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇచ్చిన పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే చిన్న నీటి ప్రాజెక్టులకు బస్వాపూర్ రిజర్వాయర్, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, గంధమల్ల, శివన్నగూడెం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేయడం ద్వారా సాగునీరు అందుతుందని. ప్రజలకు మెరుగైన వైద్యం జిల్లాలో కరువైందని జిల్లా కేంద్రం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక అందుబాటులో ఉన్న ఎయిమ్స్ పూర్తిస్థాయి వైద్యం అందక గాంధీ ఉస్మానియా లాంటి ఆసుపత్రులకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి జిల్లాలో ఉందని, అదేవిధంగా వరి పంటలు ఎండిపోయి అనేక మంది రైతులు నష్టాల బారిన పడ్డారని వారికి నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు నిర్ణయించిన వారికి కాకుండా గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

వీరితోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, సిర్పంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, ఎండి పాషా, బొల్లు యాదగిరి, గంగదేవి సైదులు, మద్దెల రాజయ్య, గడ్డం వెంకటేష్, ఎంఎ ఇక్బాల్, వనం ఉపేందర్, కోట రామచంద్రారెడ్డి, రాగీరు కిష్టయ్య, బల్గురి అంజయ్య, గోశిక కరుణాకర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, దొంతగాని పెద్దలు, ధోనురి నర్సిరెడ్డి, మంగ నరసింహులు, కళ్ళెం సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శులు దూపటీ వెంకటేష్, పల్లెర్ల అంజయ్య, గాడి శ్రీనివాస్, పోతరాజు జహంగీర్, ర్యకాల శ్రీశైలం, కొల్లూరి ఆంజనేయులు, మునుకుంట్ల లెనిన్, దుబ్బాక జగన్, ప్రజాసంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, పల్లె మధుకృష్ణ, వడ్డేబోయిన వెంకటేష్, కవిడే సురేష్, వనం రాజు, లావుడియా రాజు, గంటెపాక శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News