- Advertisement -
ఎర్రకోట, జామా మస్జిదును లక్షంగా చేసుకుని బాంబులు పెట్టినట్లు గురువారం ఉదయం బెదిరింపులు రావడంతో భద్రతా బలగాలు హుటాహుటిన కార్యరంగంలోకి దిగాయి. పూర్తిగా తనిఖీ చేసినట్లు ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి ఒకరు తెలిపారు. ఆ స్మారక ప్రాంగణాలలో బాంబులున్నట్లు ఉదయం 9.03 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని దాంతో భద్రతా బలగాలు హుటాహుటిన ఆ ప్రదేశాలకు వెళ్లి విస్తృతంగా తనిఖీ చేశాయని ఆయన తెలిపారు. ‘మేము అగ్నిమాపక శకటాలను ఆ ప్రదేశాలకు పంపాము. అక్కడ పూర్తిగా తనిఖీ చేశాము. అయితే మాకు అనుమానస్పద వస్తువేది లభించలేదు’ అని ఆ అధికారి వివరించారు.
- Advertisement -