Sunday, December 22, 2024

ఫుడ్ ప్యాకెట్లపై రెడ్‌సిగ్నల్స్ అవసరం

- Advertisement -
- Advertisement -

“red warning sign” on packaged food packets

అత్యధిక భారతీయుల డిమాండ్

న్యూఢిల్లీ : తినే తిండిలో అనారోగ్య కారకాల శాతం ఎంత అనేది తమకు తెలిసితీరాలని భారతీయులు అత్యధికంగా డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లలోని ప్యాక్డ్ ఫుడ్‌లలో ఏ స్థాయిలో అత్యధిక కొవ్వు , షుగర్, ఉప్పు వంటివి వాటిని తెలిపే ముప్పు హెచ్చరిక రెడ్ సిగ్నల్‌ను పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ వాదనను సగటున పది మంది భారతీయులలో ఏడుగురు వరకూ సమర్థించారు. ప్రమాదకర పదార్థాల పట్టిక జత చేయాల్సిందేనని జనం అత్యధికంగా కోరుతున్నారు. సామాజిక మాధ్యమ సంస్థ అయిన లోకల్ సర్కిల్స్ సంబంధిత అంశంపై సర్వే నిర్వహించింది. అందుబాటులోకి వస్తున్న ప్యాక్డ్ ఫుడ్స్ పైన ప్యాకెట్లు ఇతర హంగులతో అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిలో అనారోగ్య కారక పదార్థాలు ఏ మోతాదులో ఉన్నాయనేది పొందుపర్చడం లేదు. దీనితో ఫుడ్ ప్యాకెట్‌ల్లోని చేటు పదార్థాలు కూడా మనిషి శరీరంలోకి చేరుకుంటున్నాయి. అయితే సామాజిక బాధ్యతగా సంస్థలు వీటిపై రెడ్ సిగ్నల్ లేదా ప్రమాదరహిత పదార్థాలు ఉన్నాయని తెలిపే గ్రీన్‌సిగ్నల్స్‌ను పొందుపర్చడం మంచిదని పౌరులు సూచించారు.

ప్రతి ప్యాక్‌లోని మూల పదార్థాల ప్రాతిపదికన వాటికి చుక్కల గుర్తులతో స్టార్ రేటింగ్ ఇవ్వడం మరీ మంచిదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక కేవలం 8 శాతం మంది ఇటువంటి సంకేతాలు ఏమీ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటిలాగానే వీటిని విక్రయించవచ్చు. వాటిని వినియోగదార్లు కొనుగోలు చేయవచ్చు అని వీరు పేర్కొన్నారు. ఇంతకు ముందు దేశంలో పలు రకాల తిండ్లు ప్యాకెట్లలో కాకుండా వీటిని నేరుగానే అందించేవారు. ఇప్పుడు ఆధునికత పెరిగిన సాంకేతికత నేపథ్యంలో అత్యధికంగా జంక్‌ఫుడ్ మార్కెట్‌లోకి వస్తోంది. ప్రత్యేకించి ప్యాక్డ్ ప్రాసిసిడ్ ఫుడ్‌గా ఇది అందుతోంది. అయితే వీటి పైపై హంగులతో ఆకర్షితులై స్వీకరించే వినియోగదార్లు ప్రత్యేకించి వీటిలోని అత్యధిక స్థాయి ఫ్యాట్ , షుగర్‌ల మోతాదులతో ఉప్పుతో కాలేయ సమస్యలు, ఇతర అనారోగ్యాలకు లోనవుతున్నారు.

ఇవి చిట్టచివరికి పలు రకాల కాలేయ వ్యాధులకు దారితీస్తున్నాయి. స్థూలకాయం, పలువురిలో మధుమేహం, గుండెజబ్బులకు దారితీస్తున్నాయి. అయితే ప్యాక్డ్ ఫుడ్స్‌లలో వినియోగించే ముడి పదార్థాలలో కొవ్వు ఎంత? చక్కెర ఎంత? లవణం పాలు లెక్కలను కంపెనీలు తమ బాధ్యతగా తెలియచేయాల్సి ఉంటుంది. ఇది సామాజిక బాధ్యత అవుతుందని అధ్యయనం దశలో పలువురు సూచించారు. అయితే కేవలం మార్కెట్‌లో గిరాకీని పెంచుకునే క్రమంలో లాభాల బాటలో పడి కంపెనీలు మనుష్యుల ప్రత్యేకించి యవత ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు . ఇది నిజంగానే అసామాజికం అవుతోందని తమ సర్వే వెల్లడి దశలో ఈ సామాజిక సంస్థ తన అభిప్రాయం వెలువరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News