రెడ్‌బుల్ సహ వ్యవస్థాపకుడు
డైట్రిచ్ కన్నుమూత
వియన్నా : రెడ్‌బుల్ ఎనర్జీ డ్రింక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ డైట్రిచ్ మాటెస్చిట్జ్ కన్నుమూశారు. రెడ్‌బుల్ ఫార్ములా వన్‌రేసింగ్ జట్టుకు డెట్రిచ్ (78) యజమానిగా ఉన్నారు. రెడ్‌బుల్ బ్రాండ్ ఆసియాతోపాటు పశ్చిమ దేశాల్లో సైతం సక్సెస్ అయింది. రెడ్‌బుల్ కంపెనీని ప్రమోట్ చేసేందుకు డ్రైటిచ్ క్రీడలపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఫార్ములావన్ రేసింగ్‌కు డైట్రిచ్ సంరక్షకుడిగా వ్యవహరించారని స్పోర్ట్ గవర్నింగ్ బాడీ ఎఫ్‌ఐఎ అధ్యక్షుడు బెన్ తెలిపారు. కాగా ఫైడ్‌బుల్ 172దేశాల్లో క్యాన్ల అమ్మకాలు జరిగాయి.
స్పోర్ట్, రియల్ ఎస్టేట్, గ్యాస్ట్రోనమీ రంగాలను డైట్రిచ్ విజయంతంగా 1984లో డైట్రిచ్, థాయ్ వ్యాపారవేత్త షాలియో సంయుక్తంగా రెడ్‌బుల్‌ను స్థాపించారు. క్రేటింగ్ డెంగ్ అనే ఎనర్జీ డ్రింక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. అనంతరం రెడ్‌బుల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసి విజయాన్ని అందుకున్నారు. రెడ్‌బుల్ రేసింగ్ జట్టు కూడా విజయాన్ని 2010, 2013లో వరుసగా ఛాంపియన్‌గా జట్టు నిలిచింది. రెడ్‌బుల్ ఫార్ములా వన్ జట్టు హెడ్ క్రిస్టియన్ హార్నర్ మాట్లాడుతూ మరణం ప్రపంచానికి తీరనిలోటు అన్నారు. రెండు వారాల క్రితం జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకుని వెర్‌స్టాపెన్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా కారణమని పేర్కొన్నారు.