Wednesday, January 22, 2025

సిఎం అభ్యర్థిని డిక్లేర్ చేశాకే.. మిగతా డిక్లరేషన్ల గురించి మాట్లాడండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అధికారం తమదేనంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్.. తమ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో మొదట సిఎం డిక్లరేషన్ చేయాలని ఆ తర్వాతే ఇతర అంశాలపై చర్చించుకోవాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం 39 మంది సభ్యులు, పార్టీకి చెందిన ఇతర జాతీయ నేతలు తెలంగాణ వస్తున్నారని, మీకు తెలంగాణ సిఎం అభ్యర్థిని డిక్లేర్ చేసే దమ్ముందా..? అని ప్రశ్నించారు. మీరు ఇప్పటి దాకా చేసిన డిక్లరేషన్లు అమలు చేసే వ్యక్తి ఎవరో కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలన్నారు.

ఆ వ్యక్తి దొంగనో.. లంగనో ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుందని, ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తున్న ఏఐసిసి , సిడబ్లూసి సభ్యులంతా స్కాముల్లో, అవినీతిలో నిండా కూరుకుపోయిన వ్యక్తులేనన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, చివరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ కూడా పెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్ అని, మరి మీ సిఎం అభ్యర్థి ఎలాంటోడు అనేది ప్రజలకు తెలియాలా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఎన్ని డిక్లరేషన్లు చేసినా ఉపయోగం లేదన్నారు. మొదట సిఎం డిక్లరేషన్ చేయండని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

మా సిఎం అభ్యర్థి కెసిఆర్ అని, ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. మరి మీ సిఎం అభ్యర్థి పనిమంతుడో, పనిమంతురాలో కూడా తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటోందన్నారు. మీ పార్టీలో మా కెసిఆర్‌ని మించిన వాళ్లు ఉన్నారా..? అనేది కూడా ప్రజలకు తెలియాలన్నారు. బిసి డిక్లరేషన్ అని ఎస్‌సి,ఎస్‌టి డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ అని ఇలా నోటికొచ్చిన స్కీములన్నీ ప్రకటిస్తున్నారు సరే, మరి వాటిని అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రజలకు మొదట చెప్పాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News