సూర్యాపేట: రెడ్డిలంతా ఐక్యంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో హోటల్ 7 ఎదురుగా రెడ్డి ఆత్మీయ సమావేశ వనభోజనం మహోత్సవ సందర్భంగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం గవ్వ మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పేద రెడ్డిలకు సహాయం చేసి ఆదుకోవాలని అన్నారు. పేద రెడ్డి విద్యార్థులకు ఉన్నతమైన చదువుల కోసం రెడ్డి సంఘం నుంచి సాయం చేసి వారి ఉన్నత చదువు కోసం పాటుపడాలని కోరారు.
త్వరలో రెడ్డి సంక్షేమసంఘం భవనాన్ని ఏర్పాటు చేస్తానని, భవనానికి ప్లేస్ కూడా చూసామని వచ్చే సంవత్సరం నాటికల్లా రెడ్డి సంక్షేమ సంఘం భవనంలోనే సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకుందాం అన్నారు. మొదటగా రెడ్డి సంక్షేమ సంఘం అంటే కులాలు ఏంటని అనుకున్నాను అని, కొంతమంది ప్రోత్సాహం వల్లనే రెడ్డి సంక్షేమ సంఘం ఉండాలని పెద్దలు ఆలోచన చేశారని అన్నారు.
అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి, రెడ్డి పేద విద్యార్థులకు పది మందికి 10,000 చొప్పున డాక్టర్ భూమిరెడ్డి అందజేశారు. రెడ్డి సంక్షేమ సంఘంలో రెడ్డి రాజుల గొప్పతనాలను తెలుపుతూ వారి ఫోటోలను ప్రదర్శించారు. జబర్దస్త్ టీం వచ్చి ఆటపాటల ద్వారా కళాకారులు పాటల ద్వారా అలరింపజేశారు.