బండ చాకిరిలోనే బిసి నేతలు
జిల్లా అధ్యక్షుల ఎంపికలో బిసిలకు మొండి చేయి, బిసి అధ్యక్షులను పక్కన పెట్టి రెడ్లకు అవకాశం, పార్లమెంట్ కన్వీనర్ రెడ్డినే పార్లమెంట్ ఇంచార్జీ రెడ్డినే
జితేందర్‌రెడ్డికి, శాంతికుమార్‌కు కనీస సమాచారం ఇవ్వని రాష్ట్ర అధిష్టానం, చక్రం తిప్పిన డికె అరుణ, జిల్లా సీనియర్ నేతల అభిప్రాయలను కూడా పరిగణలోకి తీసుకోని అధిష్టానం, అసంతృప్తిలో ఇద్దరు నేతలు?
మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది భార తీయ జనతాపార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జిల్లా పార్టీలో సీని యర్ నేతలుగా కొనసాగుతున్న వారి అభిప్రా యాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా బిజెపి అధిష్టానం ఒంటెద్దు పోకడ పోవడం స రైంది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు రెడ్లను ప్రకటించడంపై బిసిలు ఆగ్రహంతో ఉ న్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట ల కు గతంలో బిసిలు అధ్యక్షులు ఉండగా వారిని మార్చి రెడ్లకు అవకాశం కల్పించడం బిజెపిలో రాజకీయంగా రచ్చరేగుతోంది. బిజెపిలో బిసి లకు న్యాయం జరగదన్న అక్షర సత్యాన్ని నిజ ం చేశారని బిసి నేతలు ఆరోపణలు గుప్పిస్తు న్నారు. పేరుకే బిసిలని చెప్పి పదవులన్నీ రె డ్లకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవు తోంది.
ఈ మార్పులు వెనుక డికె అరుణ మా ర్కు రాజకీయం కనిపిస్తోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పార్లెమంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని బిజెపి జాతీయ ఉపాd్యక్షురాలు డి కె అరుణ, మాజీ ఎంపి ఎపి జితేందర్ రెడ్డి, బి సి నేతగా రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్లు ఆ శిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లా అ ధ్యక్షుల మార్పుల విషయంలో మాజీ ఎంపి జి తేందర్ రెడ్డిని కాని, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్‌లకు కాని కనీసం సమాచారం ఇవ్వ కుండా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై జిల్లా బిజెపిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎపి జితేందర్ రెడ్డి రెండ్లు సార్లు ఎంపిగానూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది, జిల్లాలో సీనియర్ పొలిటీషి యన్‌గా ఉన్నారు.
అలాగే రాష్ట్ర కోశాధికారి బిసి నేతగా శాంతికుమార్ కొనసాగుతున్నా రు. ఈయన ఉన్నత ఉద్యోగాన్ని వదిలి పెట్టి 14 సంవత్సర ఏటనే ఆర్‌ఎస్‌ఎస్ భావాలు క ల్గిన నేత. జిల్లా బిజెపి కష్టకాలంలో ఉన్నసమ యంలో పార్టీని నడిపించిన నేత. అయితే వీ రిద్దరి సూచనలను కాని సలహాలు కాని తీసు కోకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై బిసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిసి నినాదంతో ముందుకు పోతున్న బిజెపి పార్టీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిసిలకు అవకాశం కల్గించకుండా రెడ్లను అధ్యక్షులు చేయడమేమిటని నిలదీస్తున్నారు.
డికె మార్క్, అందరూ రెడ్లే:
పార్లమెంట్‌లో పోటీ చేసేందుకు ముంద స్తుగానే తన టీంను డికె అరుణ సిద్దం చేసుకు ంటోందని జిల్లా బిజెపిలోని బిసి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులుగా ఉన్న డోకూరు పవన్ కుమార్ రెడ్డికి పాలమూరు పార్లమెంట్ కన్వీనర్ పోస్టు ఇప్పించుకుంది.అ లాగే పాలమూరు పార్లమెంట్ ఇంచార్జీగా జనగామకు చెందిన కెవిఎల్‌ఎన్‌రెడ్డి ఉన్నారు. అయితే నారాయణపేట అధ్యక్షునిగా బిసి సామాజిక వర్గానికి చెందిన
పవుటాకుల శ్రీనివాస్‌ను పక్కన పెట్టి తాజాగా మఖ్తల్ నియోజకవర్గానికి చెందిన జలంధర్ రెడ్డికి అవకాశం కల్పించారు. అ లాగే మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షునిగా బిసి సామాజిక వర్గానికి చెందిన వీర బ్రహ్మాచారి ఉండగా, ఆయన స్థానంలో తాజాగా జిల్లా కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన ఆంజనేయులు బిసి సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన పలుసార్లు కౌన్సిలర్లుగా గెలిచారు. అయినప్పటికీ ఆయనకు అధ్యక్ష పదవి దక్కలేదు. ఇలా మొత్తం అన్ని ముఖ్యమైన పోస్టు ల్లో రెడ్డి సామాజిక వర్గం ఉండడంతో,బిసిల కు సామాజిక న్యాయం పార్టీలో అందని ద్రా క్షలానే మారింది. డికె అరుణ తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో తన టీంను సిద్దం చేసుకుంది. అయితే పార్లమెంట్ పరిధిలో 70 శా తం ఉన్న బిసిలకు ఏ పోస్టుల్లో అవకాశం కల్పించక పోవడంపై వచ్చే ఎన్నికల్లో బిసిల నుంచి ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. డికె అరుణ ప్రాతినిద్యం వహించిన గద్వాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నేత అల్లుడు గెలుపుకోసమే అక్కడ ఆమె పోటీ చేయకుండా బిసిలను పోటీ చేయిందని భావన పార్టీలో ఉంది. అక్కడ కనీసం పోటీ చేసిన బిసి అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కని విషయాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవసరానికి బిసిలను ఉపయోగించుకొని అవసరం తీరాక బిసిలను రాజకీయంగా ఎదగనీయకుండ తొక్కే ప్రణాళిక పార్టీలో జోరుగా సాగుతోందని బిసి నేతలు అభిప్రాయపడుతున్నారు.
అలక పాన్పులో ఇద్దరు నేతలు…
జిల్లాల నూతన అధ్యక్షుల ఎంపిక విషయంలో సూచన ప్రాయంగానైనా జిల్లా సీనియర్ నేతలు మాజీ ఎంపి జితేందర్ రెడ్డిని కాని, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ను కాని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడంపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధిష్టానం కూడా ఈ విషయం లో ఎందకు తొందర పడిందనే అభిప్రాయం ఉంది. నారాయణపేట జిల్లా విషయంలో కూ డా సీనియర్ నేత నాగూరావు నామాజి, రతంగ పాండు రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నారు. వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జిల్లా అధ్యక్షుల ఎంపికల చేడయంపై వారు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్ ఉన్న నేతలకు ఎవరు సమర్దులు, ఎవరు కారు,ఏ సామాజిక వర్గానికి ఇస్తే రేపు పార్టీ మనుగడ ఉంటుంది, వంటి అంశాలు తెలుసు. కాని వీరెవరిని మాటవరుసకైనా సంప్రదించకుండా నూతన అధ్యక్షులను ఎంపిక చేయడంపై పార్టీలో దుబారం రేగుతోంది.
రెడ్డి వాదం …
ఇటీవల పార్టీలో బిసి వాదం తెరపైకి రావడంతో బిసిలు పార్టీని అక్కున చేర్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ కేంద్ర అధిష్టానం మెనిఫెస్టోలో పెట్టడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థా నాల్లో పార్టీ విజయం సాధించింది. పార్టీలో రాష్ట్ర అధ్యక్షునిగా బిసి నేత బండి సంజయ్ ఉన్న సమయంలో జిల్లా అధ్యక్షులు విషయంలోనూ, ఇతర పోస్టుల్లోనూ బిసి నేతలకు న్యా యం జరిగింది. అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర అద్యక్షునిగా ఎంపికైన తర్వాత జిల్లాలో రెడ్లకే ప్రా ధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాలమూరు జిల్లా విషయంలో సీనియర్ నే తలు జితేందర్ రెడ్డి, డికె అరుణలు, రెడ్డి సా మాజిక వర్గం వారే ఉన్నారు.
అలాగే రాష్ట్రంలో కిషన్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గం నాయకుడే కావడంతో పార్టీలో వారి మాటలు, సూ చనలకే పరిమిత ం కావడం బిజెపిలోని బిసిలకు అసంతృప్తికి గురి అవుతున్నారు.బిసి వాదాన్ని తొక్కి వేసి రెడ్డి వాదాన్ని తెరమీదికి తెస్తున్నారని మండి పడుతున్నారు.