Monday, December 23, 2024

ఏప్రిల్ 8న ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’

- Advertisement -
- Advertisement -

Reddygarintlo rowdyism movie

 

సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించింది.

టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, పాటలను స్టార్ హీరో రామ్‌చరణ్ విడుదల చేసి సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపారు. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా దర్శకులు ఎం. రమేష్, గోపి మాట్లాడుతూ “సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. మా కథను నమ్మి సినిమాను నిర్మించిన శిరీషా రమణారెడ్డికి థాంక్స్. మహిత్ నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News