Wednesday, January 22, 2025

కేవలం రూ. 12 వేల లోపు రెడ్‌మి కొత్త వెర్షన్ టీవీ..

- Advertisement -
- Advertisement -

మీరు స్మార్ట్ టీవీ కొనాలని చూస్తన్నారా..? తక్కువ బడ్జెట్లో అన్ని ఫీచర్స్ ఉన్న టీవీ కావాలా?.. అయితే ఈ వార్త మీ కోసమే. ప్రముఖ Xiaomi సబ్-బ్రాండ్ అయినా Redmi భారతదేశంలో Redmi Smart Fire TV కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ టీవీని 32 అంగుళాల పరిమాణంలో రిలీజ్ చేసింది. Redmi తాజా 2024 ఎడిషన్ Fire TV మోడల్ గత సంవత్సరం వలె అదే హార్డ్‌వేర్, ఫీచర్లతో
విడుదల చేసారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా Redmi Smart Fire TV గురుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధర

రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 స్మార్ట్‌టివి రూ. 11,999 ధరతో మార్కెట్లో లభిస్తోంది. ఈ టీవీ అమ్మకాలు జూన్ 11 నుండి Xiaomi వెబ్‌సైట్, Amazon, Flipkartలో ప్రారంభమవుతుంది.

స్పెసిఫికేషన్‌లు

Redmi Fire TV 32-అంగుళాల HD-రెడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 178-డిగ్రీల వీక్షణ కోణం కోసం..ఆటో తక్కువ లేటెన్సీ మోడ్, 6.5ms ప్రతిస్పందన సమయం, 96.9 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో అమర్చారు. ఈ టీవీ ప్రీమియం మెటల్ డిజైన్, నారో బెజెల్‌తో మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే, ఈ బడ్జెట్‌లో రానున్న ఇతర స్మార్ట్ టీవీలు మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్‌లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. అదే సమయంలో Redmi ఈ ప్రీమియం మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది.

పని తీరు కోసం..ఈ టీవీలో క్వాడ్ కోర్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Mali G31 MP2 GPU ఉంది. ఈ టీవీలో 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. Redmi Smart Fire TV అమెజాన్ FireTV OS 7 పై రన్ అవుతుంది. ఈ టీవీ 12,000 యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది.

అంతేకాకుండా..లైవ్ టీవీ ఛానెల్‌లు, పేరెంటల్ కంట్రోల్, డేటా మానిటరింగ్ వంటి ఫీచర్లు రెడ్‌మి ఈ టీవీలో అందుబాటులో పెట్టింది. ఈ టీవీ సౌండ్ అవుట్‌పుట్ 20W. ఇందులో రెండు 10W స్పీకర్లు కూడా ఉన్నాయి. డాల్బీ ఆడియో, DTS-HD, DTS వర్చువల్:X TVలో మద్దతునిస్తుంది. రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ రిమోట్‌లో అలెక్సా బటన్ కూడా ఉంది. అలాగే OTT యాప్‌లకు హాట్‌కీ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడితే..ఇందులో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Miracast, 2 USB 2.0 పోర్ట్‌లు, AirPlay, బ్లూటూత్ 5.0, HDMI పోర్ట్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News