Saturday, January 11, 2025

నిద్రిస్తున్న వ్యక్తి పైనుంచి రెడిమిక్స్ వాహనం వెళ్లడంతో మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో నిద్రిస్తున్న కార్మికుడి పైనుంచి రెడిమిక్స్ వాహనం వెళ్లడంతో హరేరామ్ సింగ్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News