Monday, December 23, 2024

బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించండి

- Advertisement -
- Advertisement -

Reduce the booster dose duration to 6 months

కేంద్రానికి సీరం సిఇఒ పూనావాలా వినతి

న్యూఢిల్లీ : బూస్టర్ డోసు వ్యవధిని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. కొవిడ్ పోరులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీకి కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీటిని ప్రైవేట్ కేంద్రాల్లోనే అందిస్తున్నారు. రెండో డోసు తీసుకున్న 9 నెలల గడువు పూర్తయిన వారికే పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గడువును ఆరు నెలలకు తగ్గించాలని పూనావాలా కేంద్రాన్ని కోరారు. ఈవిధంగా గడువు తగ్గిస్తే వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించవచ్చని సూచించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వీటి మధ్య వ్యవధి ఆరు నెలలుగా ఉన్నందున భారత్ కూడాఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవధి తొమ్మిది నెలలుండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమైంది. తొలిరోజు దాదాపు 10 వేల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేట్‌లో మాత్రమే ప్రికాషన్ డోసు అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News