- Advertisement -
మాంసప్రియులకు శుభవార్త. రాష్ట్రంలో చికెన్ ధరలు పడిపోయాయి. అయ్యప్ప స్వాముల దీక్షలు, కార్తీక మాసం ప్రభావంతో గత నెల రోజుల నుంచి చికెన్ ధరలు భారీగా తగ్గాయి. విక్రయాలు గణనీయంగా తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. చాలా మంది పూజలు, ఉపవాసాల కారణంగా నాన్ వెజ్ కు దూరంగా ఉంటుంన్నారు. దీంతో చికెన్ ధరలు దిగివచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో చికెన్ విత్ స్కిన్ ధర రూ.150, స్కిన్ లెస్ ధర రూ.145, డ్రెస్సుడ్ చికెన్ ధర రూ.128గా ఉంది.
చికెన్ ధరలు పడిపోవడం కారణంగా కోళ్ల ఉత్తత్తి దారులకు, వ్యాపారులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. గత నెల నుంచి తాము నష్టాలు చవిచూస్తున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. అయితే ఇదే సమయంలో మాంసం ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -