మన తెలంగాణ / హైదరాబాద్: ఒక వైపు విద్యార్థుల పరీక్షలు, మరో వైపు ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం లభిస్తోంది. సోమవారం శ్రీవారిని దర్శించకున్న సంఖ్య 65,051 మంది కాగా, 23,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి బుధ, గురువారాల్లో జరిగే సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.