Friday, November 22, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -
Reduced flow to Nagarjuna Sagar project
ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను మూసివేసిన అధికారులు

హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 59,436 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 55,978 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టిఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 311.4474 టిఎంసీలుగా కొనసాగుతోంది.

మంచిర్యాల జిల్లాలోని….

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 12260 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 19982 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టిఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 19.7864 టిఎంసీలుగా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News