Sunday, March 30, 2025

ధాన్యం ధర ఢమాల్!

- Advertisement -
- Advertisement -

మిల్లర్ల సిండికేట్.. అమాంతం తగ్గిన
ధర క్వింటా రూ.2,200లోపే రేటు
పెడుతున్న మిల్లర్లు మార్కెట్ ధరకే
కొనుగోలు చేశామంటూ రైతులతో
సంతకాలు! పట్టించుకోని
అధికారులు ప్రతిసారీ చివరిలో
మోసపోతున్న అన్నదాతలు
మనతెలంగాణ/నల్లగొండబ్యూరో: ఎండనక వాననక.. రేయనక పగలనక.. చీడపీడల తాకిడిని ఎదుర్కొంటూ ఆర్థికభారాన్ని భరిస్తూ అన్నదాతలు ఆ రుగాలం కష్టపడి పంట పండించారు. వరి దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ఈసారైనా ఇ బ్బందుల నుండి బయటపడతామనుకున్న రైతుకు ఈసారి (రబీలో) ఇబ్బంది తప్పడంలేదు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో మి ల్లర్లు సిండికేట్‌గా మారి ధరను అమాంతం తగ్గించేస్తున్నారు. మద్దతు ధరకు మంగళం పాడి తక్కు వ ధరకే కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పట్టింపులేనితనంతోనే మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. క్విం టా మద్దతు ధర రూ.2,320తో పాటు బోనస్ రూ. 500 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సిండికేట్‌గా మారిన మిల్లర్లు క్వింటా రూ.2,200 లోపే ధర పెడుతూ నిలువునా దోచుకుంటున్నారు. దీనికితోడు మద్దతు ధరకే కొనుగోలు చేశామంటూ మి ల్లర్లు ముద్రించిన లేఖలపై సంతకాలు పెట్టించుకుంటారని అన్నదాతలు వాపోతున్నారు.

వర్ష సూచనలతో మిల్లర్లు పెట్టిన ధరకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్ర తిసీజన్‌లోనూ పంట అమ్ముకు నే సమయంలో ఏదో ఒకసాకుతో వడ్ల ధర తగ్గించేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ముందు కోతలు కో సి మిల్లులకు తీసుకువచ్చిన ధాన్యానికి మద్దతు ధ ర కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసి ఒక్కసారిగా మిల్లులకు ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు పోటెత్తడంతో ధరను తగ్గించేస్తున్నారు. ధర తగ్గించడం.. కృత్రిమ కొరత సృష్టించి కొనుగోలు చేయకుండా నిలిపివేయడం మిల్లర్లకు పరిపాటిగా మారిందని రైతులు చెబుతున్నారు.నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆ యకట్టు.. మూసీ పరివాహక ప్రాంతం.. ఎఎంఆర్ పి ఆయకట్టుతో పాటు బోర్లు, బావుల కింద యా సంగిలో పది లక్షల ఎకరాల వరకు సాగైంది. సా ధారణ ఆయకట్టు కంటే విస్తీర్ణం పెరిగింది. సాగర్ జలాశయంలో నీళ్ళు పుష్కలంగా ఉండటం.. వారబందీతో నీటిని విడుదల చేశారు. ఈసీజన్‌లో పం ట దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. యాసంగిలో షింట్లు, హెచ్‌ఎంటి రకం ధాన్యం పండించారు. ఆయకట్టులో వరికోతలు ఒక్కసారి ప్రారంభమయ్యాయి. మిర్యాలగూడ, హుజూర్‌నగర్,

నల్లగొండ మిల్లులకు ధాన్యం పోటెత్తుతోంది. రైతులు వరికోత కోసం ట్రాక్టర్ బోరెలలో ధాన్యం లోడ్ చేసుకొని నేరుగా మిల్లులకు వచ్చి అమ్ముకుంటున్నారు. అయితే మిల్లర్లు అంతా సిండికేట్ గా మారివడ్ల ధరను అమాంతంతగ్గించేశారు. క్విం టా మద్దతు ధరతో కలిపి రూ.2,820 కు కొనుగో లు చేయాలి. కానీ క్వింటా రూ.2,200కు కూడా కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో కొనుగోలు కేంద్రాల్లో పోసి ఇబ్బందులు పడలేక మిల్లులకే తరలిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న మిల్లర్లు వడ్ల నాణ్యత సాకు చూపి ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అయినా చేసేది ఏమీలేక అన్నదాతలు వచ్చినకాడికి అమ్ముకొని వెళుతున్నారు. ప్రతిసీజన్‌లో ధాన్యం అమ్ముకునేటప్పుడు ఇబ్బందులు తప్పడంలేదని రైతులు అంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధరకు మద్దతు ధర పెట్టి కొనుగోలు చేసే విధంగా పాలకులు, అధికారులు చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News