- Advertisement -
న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామం తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తగ్గాయి. పెట్రోల్ ధరలను 19-22 పైసలు తగ్గించగా, దేశవ్యాప్తంగా డీజిల్ ధరలను 21-23 పైసలు తగ్గించారు. దేశంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు గడిచిన నాలుగో రోజుల వరకు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. ఢిల్లీలో పెట్రోల్ ధరలను మంగళవారం 22 పైసలు తగ్గి 90.56 రూపాయలకు చేరింది. సోమవారం రూ .90.78 గా ఉంది. డీజిల్ రూ.80.87కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైల్లో లీటర్ పెట్రోల్ రూ.96.98, డీజిల్ రూ.87.96, చెన్నైలో పెట్రోల్ రూ.92.58, డీజిల్ రూ.85.88, కోల్కతాలో రూ.90.77, డీజిల్ రూ.83.75, హైదరాబాద్లో రూ.94.16, డీజిల్ రూ.88.20కు చేరింది. దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరగా.. ఫిబ్రవరిలో నెలలో వరుసగా రెండుసార్లు తగ్గాయి.
- Advertisement -