Monday, December 23, 2024

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

Reduced retail inflation 7.04 percent in May

మేలో 7.04 శాతం నమోదు

న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతం నమోదైంది. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది 7.79 శాతంగా ఉంది. ఇక ఆహా ర ద్రవ్యోల్బణం మే నెలలో 7.97 శాతం న మోదవగా, ఏప్రిల్‌లో ఇది 8.38 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్‌తో పోలిస్తే పట్టణ ప్రాం తాల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఏప్రిల్‌లో పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 8.09 శాతం ఉండగా, మేలో 8.20 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మే నెలలో కూ రగాయల ద్రవ్యోల్బణం 18.26 శాతంగా ఉం ది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, రూ.6 తగ్గిస్తూ మే 21న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 6 రాష్ట్రాలు కూడా వ్యాట్‌ని తగ్గించాయి. దీని కారణంగా సరుకు రవాణా ఖర్చు తగ్గడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందని భావిస్తున్నారు.

అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల కంటే ఎక్కువగానే ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బిఐ పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఆర్‌బిఐ ఇటీవల 2022-23లో ద్రవ్యోల్బణ అంచనాను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 7.04 శాతంగా ఉం ది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై నిర్ణ యం తీసుకుంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా గత నెలలో ఆర్‌బిఐ రెపో రేటును రెండు దఫాలుగా 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు మొత్తం 4 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల దృష్ట్యా ఆర్‌బిఐ రెపో రేటును పెంచకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News