Wednesday, January 22, 2025

పారిశుద్ధ్య కార్మికులకు గంట పనిబారం తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Reduction of hour workload for GHMC sanitation workers

ఎండల ప్రభావంతో మధ్యాహ్నాం 12 వరకే విధులు

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు పని వేళాల్లో నుంచి 1గంట సమయాన్ని మినహాయింపు ఇచ్చారు. మే నెల కావడం, ఎండలు రోజు రోజుకు పెరుగుతుండడంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారు జామున 5 గంటల నుంచి మధ్యాహ్నాం 1గంట వరకు విధులు నిర్వహిస్తు ఉంటారు. అయితే ఎండలతీవ్రత పెరగడంతో మండుటెండలో కార్మికులు ఇళ్లకు పోవాల్సి వస్తోంది. దీంతో ఎండ తీవ్రతకు పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నాం వేళా 1 గంట పని భారాన్ని తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉదయం 5 గంటలకు విధులకు హాజరైయ్యే కార్మికులు మధ్యాహ్నాం 12 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు. అదేవిధంగా 6 గంటలకు విధుల్లోకి వచ్చే కార్మికులు మధ్యాహ్నాం 1 గంట వరకు పని చేయాల్సి చేసే విధంగా జిహెచ్‌ఎంసి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఎండల తీవ్రత తగ్గే వరకు కోనసాగుతుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News