Wednesday, January 22, 2025

లేడీస్ హాస్టల్‌లో రెఫ్రిజిరేటర్ పేలి ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

లేడీస్ హాస్టల్‌లో గురువారం రెఫ్రిజిరేటర్ పేలి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగిందని ఆ సమయంలో హాస్టల్ లోని వారు నిద్ర పోతున్నారని మధురై జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. సంగీత వెల్లడించారు. మృతులు పరిమళ, శరణ్య . మదుర సమాచార సాంకేతిక మంత్రి పి. త్యాగరాజన్ బాధితులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని చెప్పారు.

తాత్కాలిక వసతిలో హాస్టల్ వారిని, గాయపడిన బాధితులను మంత్రి కలుసుకుని పరామర్శించారు. ఈ హాస్టల్‌కు లైసెన్సు లేదని, పాతభవనంలో హాస్టల్ నడుపుతున్నారని , ఈ పాత భవనాన్ని కూల్చివేయడానికి గత ఏడాది యజమానికి నోటీస్ జారీ చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. జిల్లా లోని మొత్తం హాస్టళ్లను తనిఖీ చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News