Tuesday, January 14, 2025

గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

ప్రేమించాలని మోసం చేసిన నిందితుడు
అట్రాసిటీ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు

Refusal to marry while pregnant

మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రేమించానని చెప్పి ఓ నర్సును గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని తూర్పుగోదావరి, మలికిపురం మండలం, చింతమోరి గ్రామానికి చెందిన డి. నాగేంద్ర నగరంలోని ఇంటర్‌నెట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిమ్స్‌లో 2017లో వైఫై కనెక్షన్ ఇచ్చేందుకు వచ్చాడు. ఆ సమయంలో బాధితురాలు నిమ్స్ ఆస్పత్రిలో నర్సు శిక్షణ తీసుకుంటోంది. ఇంటర్ నెట్ కనెక్షన్ ఇచ్చిన నిందితుడు ఆమె మొబైల్ నంబర్ తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పడంతో యువతి, నిందితుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. దీంతో యువతి గర్భం దాల్చింది. తాను గర్భం దాల్చానని వివాహం చేసుకోవాలని 2021లో నిలదీసింది. అదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు నాగేంద్ర పేరెంట్స్‌తో మాట్లాడడంతో వారు కులం పేరుతో దూషించారు. బాధితురాలు అనురాధ 2021లో నిందితుడి ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లను తనకు నాగేంద్రతో వివాహం జరిపించాలని వేడుకుంది. దానికి వారు కులం పేరుతో దూషించారు. తర్వాత తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. అబార్షన్ చేయించుకుంటే వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దానిని నమ్మిన బాధితురాలు అబార్షన్ చేయించుకుంది. తర్వాత నిందితుడు బాధితురాలితో ఏడాదిపాటు సహజీవనం చేశాడు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం బాధితురాలితో ఉన్న నాగేంద్ర 16వ తేదీ ఉదయం 10గంటలకు బాధితురాలిని లక్డికాపూల్ పబ్లిక్ గార్డెన్‌లో వదిలేసి వెళ్లాడు. ఎమి చేసుకుంటారో చేసుకోండని, వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News