- Advertisement -
హింది సరిగ్గా మాట్లాడలేకపోయినందున ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానని అందాల భామ రెజీనా కాసాండ్రా అన్నారు. శివ మనసులో శృతి’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ’కొత్త జంట’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుని టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారింది రెజీనా. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు నటి రెజీనా. ప్రస్తుతం ఆమె రెండు హింది సినిమాలో నటిస్తున్నారు. తాజా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో దక్షిణాది నటినటులు కొనసాగడం కష్టమన్నారు. బాషా రాకపోవడం వల్ల తాను ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు చెప్పారు.
- Advertisement -