Sunday, December 22, 2024

భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన రీజనల్‌ మేనేజర్

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: భద్రాచలం ఆర్టీసీ డిపోను ఖమ్మం రీజనల్ మేనేజర్ ప్రభులత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భద్రాచలం ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఆమె నగదు బహుమతితో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భద్రాచలం డిపో ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న బంగారు గని అని, రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే డిపోలలో 13వ స్థానంలో ఉందని తెలిపారు. ఇక్కడి గ్యారేజీ సిబ్బంది, ఉద్యోగులు కృషి చేస్తే మరింత లాభాలను ఆర్జించ వచ్చన్నారు. అనంతరం సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వి రామారావు, అసిస్టెంట్ మేనేజర్‌లు వి గౌతమి, శ్రీనివాస్, ఎంఎఫ్ సాహితి, ఓపీఆర్‌ఎస్ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News