Thursday, January 23, 2025

ప్రాంతీయ శక్తులతోనే బిజెపికి పాతర

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాల కూటమి రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అ ఖిలేశ్ యాదవ్ వ్యక్తం చేశారు. అంతేకాదు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా గట్టి పోటీ ఇవ్వడంలో ప్రాంతీ య పార్టీల కీలక పాత్ర పోషిస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి, బి ఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లు తమదైన రీతిలో ఈ దిశగా కృషి చేస్తున్నార ని అఖిలేశ్ చెప్పారు. రాబోయే రోజుల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి రూపుదిద్దుకుంటుందన్న గట్టి నమ్మకం తనకు ఉందని పిటిఐ వీడియోకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో అఖిలేశ్ చెప్పారు. అయితే ప్రతిపక్ష కూటమి తో తన పాత్ర ఏమిటో కాంగ్రెస్ పార్టీయే నిర్ణయించుకోవాలన్నారు. మీరు కాంగ్రె స్, బిజెపిలు రెండింటినీ ఒకటిగా చూస్తున్నా రా? అని ప్రశ్నించగా, చాలా రాష్ట్రాల్లో కాషా య పార్టీతో పోరాటం చేస్తున్నది ప్రాంతీయ పార్టీలేనని అన్నారు.

‘బిజెపితో పోలిస్తే కాంగ్రె స్ పార్టీ చాలా రాష్ట్రాల్లో లేదని, అక్కడ కాషా య శిబిరంతో సర్వశక్తులు ఒడ్డి పోరాటం చే స్తున్నది ప్రాంతీయ పార్టీలేనని ఆయన అం టూ, ఈ పోరాటంలో అవి విజయం సాధిస్తాయని తాను ఆశిస్తున్నాని చెప్పారు. జెడి(యు), ఆర్‌జెడి, డిఎంకె లాంటి కొన్ని పార్టీలు ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నాయి కదా అని అడగ్గా, ఆ పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నాయని అఖిలేశ్ అన్నారు. ‘ఇది ఒక పెద్ద పోరు. ఈ పోరులో తమ పాత్ర ఏమిటో కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరని అడగ్గా, ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, ప్రస్తుతం అది ముఖ్యం కాదని అన్నారు.2014, 2019 ఎన్నికల్లో బిజెపి చేసిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదని అఖిలేశ్ అన్నారు.

కాంగ్రెస్ కంచుకోటలుగా భావిస్తున్న రాయబరేలి, అమేథీలలో సమాజ్‌వాది పార్టీ పోటీ చేస్తుందా? అని అడగ్గా, అమేథీలో ఎస్‌పి కార్యకర్తలను చంపేస్తున్నారని అఖిలేశ్ ఆరోపించారు. తమ కోసం ఎవరు పోరాటం చేస్తారని తమ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు తమకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయబరేలినుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో యుపిలో బిజెపి జైత్రయాత్రను అడ్డుకోవడానికి సమాజ్‌వాది పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతుంద్న ఆయన చెప్పారు. అదానీ అంశంపై మాట్లాడుతూ , అదానీ దేశ సంపదను, ప్రజల సొమ్మును దోచుకోవడానికి కేంద్రం అనుమతిస్తోందని అఖిలేశ్ ఆరోపించారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐలో కోల్పోతున్న ప్రజల సొమ్ముకు జవాబుదారీ ఎవరని ఆయన ప్రశ్నించారు.

బిజెపికీ కాంగ్రెస్ గతే

కాగా ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బిజెపి కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లాగా తుడిచిపెట్టుకు పోతుందని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మరింత పెరుగుతుందా అని అడగ్గా, అలా జరిగే అవకకాశాలు లేకపోలేదని ఆయన అంటూ, అయితే అది కాషాయ పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడదని, ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభమవుతాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏర్పడబోయే విపక్షాల కూటమికి సంబంధించిన వ్యూహాలు ఏమిటని అడగ్గా దాన్ని వెల్లడించబోమని అఖిలేశ్ అన్నారు. ప్రధాన లక్షం బిజెపిని ఓడించడం అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసుల చర్య గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు మేలు చేయడం కోసం బిజెపి ఈ చర్య తీసుకుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బిజెపిని అడ్డుకోగలిగే రాష్ట్రం యుపి ఒక్కటేనని, అక్కడ దేశం అందరి చూపు సమాజ్‌వాది పార్టీపైనే ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా అఖిలేశ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News