Monday, November 18, 2024

తెలంగాణ మోడల్‌ను కోరుకుంటున్న మహారాష్ట్ర ప్రజలు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పాలనను మహారాష్ట్ర ప్రజలు ప్రతిరూపంగా కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ నాయకురాలు కె. కవిత శనివారం అన్నారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు ఇవ్వగలుగుతోందని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఎందుకు అలా చేయలేకపోతోందని,  రోజుకు రెండు గంటలు మాత్రమే తాగునీరు ఇస్తున్నదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కార్యకలాపాలను విస్తరించాలని మహారాష్ట్ర ప్రజలు అభ్యర్థిస్తున్నారని ఆమె తెెలిపారు.

తెలంగాణ మహారాష్ట్రతో దాదాపు 1,000 కిమీ. సరిహద్దును పంచుకుంటోంది, అయితే సంక్షేమ పథకాలు , అభివృద్ధి పరంగా చాలా తేడా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే విషయమై బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటన చేస్తుందని కవిత తెలిపారు. వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకుగాను బిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత మహారాష్ట్రకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News