Sunday, December 22, 2024

సిక్కింలో వికసించని కమలం

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ (బిజెపి) సిక్కింలో 31 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసింది కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత అసెంబ్లీలో పార్టీకి 12 మంది సభ్యులు ఉన్నారు. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆదివారం ప్రకటించారు. సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కెఎం) 32లోకి 31 సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ హిమాలయ రాష్ట్రంలో బిజెపి 5.18 శాతం వోట్లు మాత్రమే సాధించగలిగింది. ఎస్‌కెఎంకు 58.38 శాతం వోట్లు రాగా, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్‌డిఎఫ్)కు 27.37 శాతం వోట్లు వోట్లు వచ్చాయి.

సిక్కిం బిజెపి అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంఎల్‌ఎ దిల్లీ రామ్ థాపా అప్పర్ బుర్తుక్ అసెంబ్లీ నియోజకవర్గంల ఎస్‌కెఎం అభ్యర్థి కళా రాయ్ చేతిలో ఓడిపోయారు. లాచెన్ మంగన్ సీటు మినహా 31 సీట్లలో బిజెపి పోటీ చేసింది. కానీ, చాలా వరకు సీట్లలో కాషాయ పార్టీ అభ్యర్థులు తమ ధరావతులను కోల్పోయారు. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ నేతృత్వంలోని ఎస్‌కెఎంతో సీట్ల పంపిణీ చర్చలు విఫలం కావడంతో బిజెపి ఆ పార్టీతో పొత్తును తెంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News