Wednesday, December 25, 2024

కెటిఆర్‌పై కేసుల పరంపర

- Advertisement -
- Advertisement -

రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు నిత్యం ప్రయత్నం చేస్తున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై ప్రభుత్వం కేసులు బకాయిస్తూ ఆయనను వేధించే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కెటిఆర్ నిలవరించేందుకు రాష్ట్రం నలుమూలలా కేసులు బనాయిస్తోంది. ఏలాగైనా కెటిఆర్‌ను అరెస్ట్ చేసి ఆయనను జైల్లో వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే కెటిఆర్ నిరసనలు తెలిపినా సరే కేసులు పెడుతోంది. ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్‌లలో ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్‌కు రేవంత్ రెడ్డి కొరకరాని కొయ్యగా కెటిఆర్ తయారయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను వైఫల్యాలను నిత్యం ఎండగడుతూ ప్రభుత్వం పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, హామీల అమలులో వైఫల్యాలు నిత్యం ఎండగడుతున్నారు. పైగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అరాచాకాలు, అవినీతి బాగోతాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నారు. మూసీ, అమృత్ టెండర్లు, కొడంగల్ -నారాయణ్‌పేట్ ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఫార్మా విలేజ్ పేరుతో భూదందాలు, ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిఎం చేస్తున్న ప్రయత్నాలను ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నారు. దీంతో కెటిఆర్‌ను నిలవరించకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏదో కేసులో కెటిఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో వేసి ఆయన గొంతు విప్పకుండా చేసేందుకే కెటిఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఆరు కేసులు నమోదు
ఇప్పటికే కెటిఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆరు కేసులు నమోదు చేసింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారంటూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు. అమరవీరుల స్పూపం వద్ద ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో (ఎఫ్‌ఐఆర్ నెం. 481/2023) ఒక కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ (ఎఫ్‌ఐఆర్ నెం. 453/2023) ఒక కేసును నమోదు చేయగా, మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడారంటూ మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ (ఎఫ్‌ఐఆర్ నెం. 118/2024) లో కేసు పెట్టారు. ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అంటూ సంబోధించారని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ (ఎఫ్‌ఐఆర్ నెం. 321/2024)లో కేసు నమోదు చేయగా, మూసీ ప్రాజెక్ట్‌పై చేసిన వ్యాఖ్యలకుగానూ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ (ఎఫ్‌ఐఆర్ నెం. 205/2024)లో కేసు నమోదు చేశారు. చార్మినార్ వద్ద నిరసన వ్యక్తం చేసినందుకు చార్మినార్ పోలీస్ స్టేషన్ (నంబర్ లేని ఎఫ్‌ఐఆర్)లో కేసు బనాయించారు. ఇదే కేసులో బిజెపి నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మాత్రం ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News