- Advertisement -
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా టీకా రెండోదశ పంపిణీ సోమవారం ప్రారంభమైంది. టీకా తీసుకోవాలనుకునే వారు ముందుగా కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొవిన్ యాప్‌లో నమోదు ప్రక్రియ అవకాశం ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటర్లకే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్సులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ అవసరమనుకుంటే ముందుగా కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి ఈ పోర్టల్ అందుబాటు లోకి వచ్చింది.
- Advertisement -