Wednesday, January 22, 2025

అక్రమ ఓట్ల నమోదు అరికట్టాలి

- Advertisement -
- Advertisement -

సిఈఓకు సిపిఎస్ యూనియన్ వినతి

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని సిపిఎస్ యూనియన్ నాయకులు కోరారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్‌లు శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజును కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్నికల అధికారి దృష్టికి తెచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానంగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ మందకోడిగా సాగుతున్నందున ఉన్నత పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ ఓటర్ల నమోదు చివరి రోజైన 7వ తేదీన ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర సరిహద్దుల్లో జిల్లాల్లో నారాయణపేట్ ,జోగులంబగద్వాల్ లో పనిచేస్తూ పక్క రాష్ట్రంలో నివాసముంటున్న వారి ఆధార్ నివాస ప్రాంతాల ఆధారంగా కాకుండా ఉద్యోగం చేసే సంస్థ ఆధారంగా ఓటు నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి నమోదు అవుతున్న అక్రమ ఓటర్లను అరికట్టాలని కోరారు. బాధ్యులైన అధికారులకు సరియైన మార్గదర్శకాలు ఇవ్వాలని, ఓటర్ల నమోదు తేదీని పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్‌కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News