కాగా లివిన్ రిలేషన్ షిప్(సహజీవనం) పట్ల ఈ బిల్లు ప్రత్యేక దృష్టి సారించింది. భారతీయ సంస్కృతి దెబ్బతింటోందన్న ఉద్దేశంతో, యువతలో మార్పు తీసుకు రావడం కోసం సహజీవనంపై కొన్ని కీలక నిబంధనలను తీసుకువచ్చింది.ఈ బిల్లు ప్రకారం.. ఎవరైతే లివిన్ రిలేషన్‌లో ఉన్నారో, ఎవరైతే సహజీవనం చేయయాలని అనుకొంటున్నారో అలాంటి వారు తమ రిలేషన్‌ను జిల్లా అధికారి వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఒక వేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్లకంటే తక్కువ ఉంటే వారి తల్లిదండ్రుల సమ్మతి కచ్చితంగా అవసరమవుతుంది.
ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ బిల్లు హెచ్చరించింది. సహజీవనం చేసే భాగస్వాములు తమ సంబంధాన్ని నెలరోజుల్లోగా రిజిస్ట్రార్‌కు సమర్పించకపోతే నెల రోజులదాకా జైలు శిక్ష, రూ.10 వేలదాకా జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ అనుభవించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన పక్షంలో ఇంకా ఎక్కువ పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే లివిన్ రిలేషన్ షిప్‌లో మహిళను గనుక జీవిత భాగస్వామి వదిలేసినట్లయితే ఆమె భరణం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేకాకుండా తమ సహజీవనాన్ని రద్దు చేసుకునేందుకు కూడా బిల్లులో వీలు కల్పించారు.