Thursday, January 23, 2025

రియల్‌ఎస్టేట్ వ్యాపారిపై పీడీ యాక్టు నమోదు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య చేసి బెదిరింపులకు పాల్పడిన మామిడి శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి సోమవారం పీడీ యాక్టు ఉత్తర్వులు జారీ చేశారు.మందమర్రి సర్కిల్ ఇన్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ అశోక్‌లు పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వులను అందజేసి నిందితున్ని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమర్రి సర్కిల్ ఇన్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ అశోక్‌లు మామిడి శ్రీనివాస్ రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హత్యలు, నేరపూరిత బెధిరింపులకు పాల్పడడం, అక్కడి ప్రాంతాల ప్రజలలో భయాందోళనలు సృష్టించడం, తద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్నారు.

ఈ క్రమంలో లక్ష్మికాంతరావు హత్య, కొంత మందిని బెధిరింపులకు పాల్పడుతున్నాడని, నిందితుడిపై రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నేరస్థునిపై పీడీ యాఉ్ట అమలు చేయుటకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మందమర్రి సర్కిల్ ఇన్ప్‌పెక్టర్ మహేందర్‌రెడ్డి, రామకృష్ణాపూర్ అశోక్‌లను సీపీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News