Tuesday, April 1, 2025

వ్యక్తిపై పీడీ యాక్టు కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : వ్యక్తిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ రౌతు గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్ సిటీకి చెందిన గారాల శివశంకర్ అనే వ్యక్తి గతంలో మూడు మ్యారేజెస్ చేసుకొని సంతృప్తి చెందక 8 మే 2023న నల్లగొండ పట్టణంలోని బీటీఎస్‌కు చెందిన 16 సంవత్సరాల మైనర్ను బలవంతంగా వివాహమాడి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడగా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పై కేసు నమోదు చేసి నల్గొండ డిస్టిక్ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

నిందితుడిపై గతంలో మూడు కేసులు ఉన్నాయని, డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మంగళవారం నల్గొండ డిస్టిక్ జైల్ నుంచి చంచలగూడ జైలుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News