Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వివరాల నమోదు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, కోడేరు, ఉర్కొండ, కల్వకుర్తి, అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, పదర, లింగాల మండలాల ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలకు మంగళవారం నాగ ర్‌కర్నూల్ విద్యాధికారి కార్యాల యంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ గోవిందరాజులు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. కనీసం పది విద్యా ర్థులు గల పాఠశాలకు ఒకటి, 165 కంటే ఎక్కువ విద్యార్థుల గల పాఠశాలలకు 2 ట్యాబ్‌లను అందజే శారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇన్ఫోలో ఆ పాఠశాల పేరుతో నమోదై ఉన్న ఉపాధ్యాయులకు వారి వివరాలు ఆన్లైన్‌లో నమోదు చేసి అందించారు.

జిల్లాలో 588 ప్రాథమిక పాఠశాలలకు 481 ట్యాబ్‌లు, 128 ప్రాథమికొన్నత పాఠశాలలకు 128, మొత్తం 716 పా ఠశాలలకు 609 ట్యాబ్‌లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో యు డైస్ తొలిమెట్టు ప్రగతి, విద్యార్థుల ప్రవేశాలు, టిసిల జారీ, మార్కుల వివరాల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మన ఊరు మన బడి పనుల పురోగతి, ఆదాయ వ్యయాలు, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, తల్లిద ండ్రుల సమావేశాల నిర్వహణ తదితర పనులను పక్కాగా వినియోగించుకోనున్నట్లు డిఈఓ తెలిపారు. పారదర్శకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు వివరాలను సైతం ట్యాబ్‌ల ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు డిఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షణ కో ఆర్డినేటర్ బరపటి వెంకట య్య, నూరుద్దీన్, షర్పుద్దీన్, మురళీధర్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News